రోజులో ఎండుద్రాక్ష ఎన్ని తినాలి? ఎన్ని తింటే ఆరోగ్యమంటే..!
ఎండుద్రాక్ష శక్తివంతమైన డ్రై ఫ్రూట్స్ లో ప్రధానమైనది.
కొందరు ఎండుద్రాక్షను నేరుగా తింటే.. మరికొందరు రాత్రి నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తింటుంటారు.
ఎండుద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, యాంటీఆక్సిడెంట్లు సహా అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి.
ఒక రోజులో సుమారు 30 నుండి 60 గ్రాముల ఎండుద్రాక్ష తినవచ్చు.
రోజులో 30 నుండి 60 గ్రాముల వరకు ఎండుద్రాక్షను తినడం వల్ల కాలరీలు అధికంగా పరిమితంగా శరీరంలోకి వెళతాయి.
ఎండుద్రాక్షలో సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. క్రీడాకారులకు, ఎక్కువ శ్రమ చేసేవారికి ఇవి మంచి బూస్టింగ్ ఫుడ్.
ఎండుద్రాక్షలలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. ప్రేగు కదలికలను ప్రోత్సహించడం ద్వారా మలబద్దకం తగ్గిస్తుంది.
ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఎండుద్రాక్షలో కాల్షియం, బోరాన్ ఉంటాయి. ఇవి రెండూ ఎముకలను బలంగా మార్చడంలో, బోలు ఎముకల వ్యాధి నివారించడంలో సహాయపడతాయి.
తీపి శాతం ఎక్కువగా ఉన్నా ఎండుద్రాక్ష తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగి ఉంటుంది. వీటిని మితంగా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నిలకడగా ఉంటాయి.
Related Web Stories
ఈ సమస్యలు ఉన్నవారు బంగాళదుంపను తినకపోవడమే మంచిది
పరిగడుపునే ఉసిరికాయ జ్యూస్ తాగితే..
ఈ 7 తప్పులు చేయడం వల్ల.. మీ ఎముకలు దెబ్బతింటాయని తెలుసా..
హిమోగ్లోబిన్ పెంచే బెస్ట్ ఫుడ్స్ ఇవే...