సుదీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా ఉండేందుకు రాత్రిళ్లు తగినంత సేపు నిద్రపోవాలి.

4 నుంచి 12 నెలల వయసున్న శిశువులు రోజులో కనీసం 16 గంటలు  నిద్రపోతారట 

ఒకటి నుంచి రెండు సంవత్సరాల వయసున్న చిన్నారులు రోజులో 11 నుంచి 14 గంటలు నిద్రపోవాలి

ఇక 3 నుంచి 5 ఏళ్ల వయసున్న చిన్నారులకు కనీసం 11 గంటల నిద్ర అవసరం

6 నుంచి 12 ఏళ్ల వయసున్న బాలబాలికలకు రాత్రిళ్లు 9 నుంచి 12 గంటల నిద్ర సరిపోతుంది

టీనేజ్‌లో ఉన్న వారికి రోజుకు కనీసం 8 గంటల నిద్ర సరిపోతుంది

18 ఏళ్లు పైబడిన వారికి కనీసం 7 గంటల నిద్ర ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది

60 ఏళ్లు పైబడిన వారికి రాత్రిళ్లు 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.