పైసా ఖర్చు పెట్టకుండా సునాయసంగా చేయగలిగిన కసరత్తుల్లో నడక మొదటి స్థానంలో నిలుస్తుంది

ఏ వయసు వారైనా చేయగలిగే ఈ కసరత్తుతో ప్రయోజనాలు మాత్రం వెలకట్టలేనివి

నడకతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా పెంపొందుతుంది

ఇక రోజుకు ఎంత దూరం నడవాలనేది ఆయా వ్యక్తులపై వయసు, ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది

18 - 30 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు రోజుకు గంట వరకూ నడవొచ్చనేది నిపుణుల అభిప్రాయం

31 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు రోజుకు 30 నుంచి 45 నిమిషాల పాటు నడవాలి

51 - 65 ఏళ్ల మధ్య వారికి రోజుకు 30-40 నిమిషాల నడక ఎముకల దృఢత్వానికి అవసరం

వృద్ధులు గరిష్ఠంగా రోజుకు అరగంట పాటు నడిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.