తిన్న వెంటనే నీళ్లు తాగొచ్చా..  తాగితే ఏమౌతుంది..!

రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే అనారోగ్యాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

అన్నం తింటున్నప్పుడు లేదా  తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగుతుంటారు.

 అయితే, తిన్న వెంటనే నీరు తాగితే ఎసిడిటీ లేదా కడుపుబ్బరంగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు

 ఒక్కోసారి ఈ అలవాటు అనారోగ్యానికీ  కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా కడుపులోని ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటలు పడుతుంది

ఈ మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగితే అవి జీర్ణక్రియకు అడ్డుపడతాయి.

కాబట్టి ఆహారం తిన్నాక 45  నుంచి 60 నిమిషాల తరువాత  నీరు తాగాలి

అంతేకాకుండా, తినడానికి అరగంట ముందు మాత్రమే నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు