తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం తీవ్ర కలకలం రేపింది. స్వచ్ఛమైన నెయ్యిని గుర్తించడమెలాగో తెలుసుకుందాం..
స్వచ్చమైన నెయ్యి ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. వేడి చేసినప్పుడు గుబాళిస్తుంది. కల్తీ నెయ్యిలో వాసన ఉండదు.
ఆవు నెయ్యి లేత బంగారు పసుపు రంగులో ఉంటుంది. కల్తీ నెయ్యి రంగు విభిన్నంగా ఉంటుంది.
స్వచ్ఛమైన నెయ్యి గది ఉష్ణోగ్రత వద్ద క్రీమ్ లా మారుతుంది.
స్వచ్ఛమైన నెయ్యిని ఫ్రిజ్‌లో ఉంచితే గడ్డకడుతుంది. గది ఉష్ణోగ్రత వద్ద ఉంచితే మృదువుగా మారుతుంది. ఫ్రిజ్‌లో ఉంచినా లిక్విడ్ రూపంలో ఉంటే అందులో ఇతర నూనెలు లేదా కొవ్వులు కలిసినట్లు అర్థం చేసుకోవచ్చు.
పాన్‌లో కాస్తంత నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి అడుగున ఏవైనా ఇతర పదార్థాలు కనిపిస్తే కల్తీ జరిగినట్లు గుర్తించాలి.