వేస‌విలో వ‌చ్చే గ్యాస్ స‌మ‌స్య‌ల‌కు  ఇలా చెక్ పెట్టండి..!

ధూమపానం, మద్యపానం, తినేటప్పుడు మాట్లాడటం.. చాలా త్వరగా తినడం వల్ల కూడా గ్యాస్ సమస్యలు వస్తాయి.

గ్యాస్ సమస్య ఉన్నవారికి మజ్జిగ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. పల్చటి మజ్జిగ తాగటం వల్ల తక్కువ టైంలో రిలీఫ్ పొందొచ్చు.

పొట్టలో ఏర్పడే ఎసిడిటీ నుంచి యాపిల్ సైడర్ వెనిగర్ ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రోజూ ఉదయం లేవగానే పుదీనా ఆకుల్ని తినవచ్చు. లేదా పుదీనా టీ తాగినా కూడా గ్యాస్ సమస్య నుంచి తక్షణ విముక్తి లభిస్తుంది.

మెంతులు, అల్లం, చామంతి, పుదీనా ఆకులు, తులసి వంటి వాటితో చేసిన హెర్బల్ టీలు తాగటం వల్ల గ్యాస్ సమస్య తగ్గుతుంది.

మెంతులు నానబెట్టుకుని తిన్నా.. నీటిలో మరిగించి.. ఆ నీటిని తాగినా మంచి ఫలితాలు ఉంటాయి.

ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా  వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.