వ్యాయామం తర్వాత కండరాల నొప్పిని ఎలా తగ్గిచవచ్చు..!
ఐస్ ప్యాక్ ఉపయోగించడం వల్ల కండరాలు కీళ్ల వాపు తగ్గుతుంది. సన్నని టవల్ తో నొప్పి ఉన్న కండరాలపై 15 నిమిషాలు ఉంచడం వల్ల వాపు నుంచి, నొప్పి నుంచి ఉపశమనం ఉంటుంది.
కండరాలు మరీ నొప్పిగా ఇబ్బంది పెడుతుంటే మాత్రం హీట్ ప్యాక్ పెట్టుకోవడం నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది.
వేడి నీటి స్నానం కూడా ఆరోగ్యము, అలసట నుంచి ఉపశమనము ఇస్తుంది.
ట్రిగ్గర్ పాయింట్ స్పోర్ట్స్ మసాజ్ గట్టి కండరాలను విశ్రాంతిని, కండరాల నొప్పుల నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
కండరాల నొప్పి బిగుతుగా మారిన కండరాలను సాగే విధంగా కాసేపు నడవాలి. ఇలా చేస్తే ఉపశమనం ఉంటుంది.
వ్యాయామం నొప్పి కారణంగా మానకూడదు. ఇది కండరాల నొప్పి కారణంగా మానేస్తే మళ్ళీ సాధ్యం కాదు.
వ్యాయామాలను కండరాల మీద దృష్టితో చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల కండరాలు బావుంటాయి.
కండరాల నొప్పి గాయానికి గరైనట్టు సంకేతం కావచ్చు. మరీ గ్యాప్ ఇవ్వకుండా వ్యాయామం చేస్తేనే మంచిది.