శరీరంలో జింక్ లోపం ఉంటే..!

శరీరంలో రోగనిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే జింక్ అవసరం. 

జింక్ తక్కువగా ఉంటే న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్లు పెరిగే ప్రమాదం ఉంటుంది.

అతిసారం ఉన్న పిల్లల్లో జింక్ తక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు.

పురుషుల్లో లైంగిక ఆరోగ్యాన్ని పెంచడంలోనూ జింక్ అవసరం. 

ఆరోగ్యకరమైన చర్మానికి జింక్ చాలా అవసరం. గాయాలను నయం చేయాలన్నా జింక్ కావాలి. 

జింక్ యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. 

జింక్ లోపం ఉంటే ఆక్సీకరణ ఒత్తిడి, అధిక రక్తపోటు, మధుమేహం దీర్ఘకాలిక వ్యాధుల మధ్య సంబంధం ఉంటుందని అధ్యయాలు తేల్చాయి.