ఉదయాన్నే ఇలా చేస్తే కొలెస్ట్రాల్ ఐస్‌లా కరుగుతుందట..
ఉదయాన్నే కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ నియంత్రించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు
ప్రతిరోజూ మీ అల్పాహారంలో కొన్ని వాల్‌నట్‌లను తింటే.. ఇవి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి
బాదం మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి.. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ఆలివ్ నూనె దీంతో వంట చేసుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ నూనె మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అవిసె గింజలలో ఎన్నో పోషకాలతో పాటు.. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి.. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.
మార్నింగ్ వాక్, వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. రెగ్యులర్ ఏరోబిక్ వ్యాయామం రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆరెంజ్ జ్యూస్: విటమిన్ సీ పుష్కలంగా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ఉదయం పూట ఒక గ్లాసు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.