రోజూ 2కప్పుల కంటే ఎక్కువ టీ తాగితే.. జరిగేది ఇదే..!
చలికాలంలో వెచ్చదనం కోసం చాలామంది పదే పదే టీ తాగుతారు.
ఉదయాన్నే టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఏ పని చేయబుద్ది కాదు.
రోజులో రెండు కప్పుల టీ తాగితే ఒత్తిడి, అలసట తగ్గుతాయి. కానీ రెండు కప్పుల కంటే ఎక్కువ తాగితే శరీరానికి హాని కలుగుతుంది.
టీ ఎక్కువ తాగితే ఐరన్ లోపం వస్తుంది. టీలో ఉండే టానిన్లు శరీరం ఐరన్ గ్రహించకుండా చేస్తాయి. ఇది రక్తహీనతకు కారణం అవుతుంది.
పదే పదే టీ తాగితే జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
టీ తాగితే తలనొప్పి తగ్గుతుందంటారు కానీ ఎక్కువ తాగినా తలనొప్పి వస్తుంది. టీ వ్యసనానికి గురవ్వడం వల్ల ఇది జరుగుతుంది.
టీ ఎక్కువ తాగితే అందులో ఉండే కెఫిన్ కారణంగా నిద్రలేమి, కలతనిద్ర వంటి నిద్ర సమస్యలు వస్తాయి.
ఎక్కువసార్లు టీ తాగితే చక్కెర కూడా ఎక్కువగా శరీరంలోకి వెళుతుంది. ఇది అధికబరువుకు, మధుమేహానికి దారితీస్తుంది.