ఈ టిప్స్ ఫాలో అవుతుంటే చాలు..  ఫ్యాటీ లివర్ సమస్య రానే రాదు..!

అధిక బరువు కాలేయాన్ని  ప్రభావితం చేస్తుంది.  కాలేయం పనితీరును  దెబ్బతీస్తుంది

తీసుకునే ఆహారాన్ని బట్టే  ఆరోగ్యం ఉంటుంది. అధిక  కేలరీలు, వేయించిన ఆహారాలు,  జంక్ ఫుడ్స్ మొదలైనవి  కాలేయాన్ని దెబ్బతీస్తాయి

రెగ్యులర్‌గా వ్యాయామం  చేయడం వల్ల మొత్తం శరీరం  ఆరోగ్యంగా ఉంటుంది.

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు,  యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు  ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో  సహాయపడతాయి

శుద్ది చేసిన చక్కెర  ఊబకాయానికి కారణం  అవుతుంది. కాలేయం  సహా మొత్తం ఆరోగ్యానికి  చేటు చేస్తుంది

చక్కెరకు బదులు బెల్లం,  తేనె వంటి సహజ తీపి  పదార్థాలను తీసుకోవాలి

విటమిన్-ఎ, విటమిన్-సి  వంటి యాంటీ ఆక్సిడెంట్లు  కాలేయాన్ని  ఆరోగ్యంగా ఉంచుతాయి

సిట్రిక్ పండ్లు, ఆకుకూరలు  తీసుకుంటే కాలేయం  సేఫ్ గా ఉంటుంది