కంటి కేన్సర్‌కు సంబంధించిన ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడాలి. 

అస్పష్టంగా కనిపించడం, ప్రతిదీ రెండుగా కనిపిస్తుంటే జాగ్రత్తపడాలి. 

చాలా రోజులుగా కంటి చుట్టూ నొప్పి ఉన్నా కూడా వైద్యుడిని సంప్రదించాలి.

కళ్లు పదే పదే ఎర్రబడడం అలెర్జీ లేదా కంటి కేన్సర్‌కు కారణం కావొచ్చు. 

కనురెప్పలపై కణితులు లేదా గాయాలు కూడా కేన్సర్‌కు సంకేతం అవ్వొచ్చు. 

కంటి ఆకారంలో మార్పు కూడా కేన్సర్‌కు ప్రారంభ సూచిక కావొచ్చు. 

ధూమపానం కంటి కేన్సర్‌తో పాటూ అనేక రకాల కేన్సర్లకు కారణమవుతుంది. 

పచ్చి కూరగాయలు, పండ్లు తినడం వల్ల కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. 

ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.