క్యాప్సికమ్ గురించి ఈ విషయాలు తెలిస్తే.. రోజూ తినకుండా అస్సలు ఉండలేరు తెలుసా..
క్యాప్సికం లో ఉండే గుణాలు కీళ్ల నొప్పులను నియంత్రించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తాయి
ఇందులో ఉండే క్యాప్సైసిన్ యూరిక్ యాసిడ్ ను నియంత్రించేందుకు ఎంతగానో సహాయపడుతుంది
క్యాప్సికమ్ లో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గడానికి క్యాప్సికమ్ చక్కగా ఉపయోగపడుతుంది.
క్యాప్సికంలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
క్యాప్సికంలో ఉంటే బీటా కెరోటిన్ కళ్ళ ఆరోగ్యానికి చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుంది
క్యాప్సికం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. గుండె జబ్బులతో పాటు ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు క్రమం తప్పకుండా క్యాప్సికం తమ ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు.