చలికాలంలో పసుపును ఇలా వాడితే ఆరోగ్యానికి ఢోకా ఉండదు!
గోరువెచ్చని పాలల్లో ఒక టీ స్పూను పసుపు, చిటికెడు మిరియాలు, కొద్దిగా తేనె లేదా బెల్లం వేసుకుని తాగితే రోగనిరోధక శక్తి బలోపేతమై దగ్గు, జలుబు లాంటి సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది
తేనెలో పసుపు కలుపుకుని ఓ డబ్బాలో దాచుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఓ టీస్పూను తింటే దగ్గు, గొంతుగరగర, ఇతర సీజనల్ అలర్జీలేవీ దరిచేరవు
అన్నానికి నూనె, పసుపు జత చేసి పసుపు అన్నాన్ని సిద్ధం చేసుకోవచ్చు. దీన్ని ఏదైనా కూరతో తింటే ఆరోగ్యంగా ఉంటారు.
చలికాలంలో చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పసుపు ఫేస్ మాస్కులు ఎంతో ఉపయోగపడతాయి. దీంతో , చర్మంలో డ్రైనెస్ తగ్గి కాంతులీనుతుంది
పసుపు జోడించిన గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దన చేసుకుంటే కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు మటుమాయం అవుతాయి.
మీకు నచ్చిన ఫ్రూట్ జ్యూసుల్లో కాస్తంత తేనె, పసుపు కూడా వేసుకుని స్మూతీలు తయారు చేసుకోని తాగితే. వీటితో రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది