చర్మాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోవాలి.. అలాగే పొడిబారిపోకుండా కాపాడుకోవాలి.
వయసు పైబడేకొద్దీ చర్మం సాగే గుణాన్ని కోల్పోయి, ముడతలు పడుతుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడం కోసం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా చూసుకోవాలి.
సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.. అలాగే కంటి నిండా నిద్రపోవాలి.
చర్మం తేమను కోల్పోకుండా మన్నికైన మాయిశ్చరైజర్ ఉపయోగించాలి.
స్నానం చేసిన వెంటనే చర్మం మీద తడి ఆరిపోకముందే మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. అలాగే కాలంతో సంబంధం లేకుండా నాణ్యమైన సన్‌స్క్రీన్ లోషన్‌ను వాడుకుంటూ ఉండాలి.
ఎండ సోకడం వల్ల చర్మం జీవం కోల్పోతుంది.. కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా చేతులకు కూడా సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలి.
గరుకుగా ఉండే స్క్రబర్స్ ముఖానికి వాడకూడదు. సబ్బుకు బదులుగా ఫేస్ వాష్ అలవాటు చేసుకోవాలి.
చర్మాన్ని యవ్వనంగా ఉంచే ఆహార పదార్థాలకు భోజనంలో చోటు కల్పించాలి.. సలాడ్లు, పండ్లు ఎక్కువగా తినాలి. ప్రొటీన్లు, పీచు ఆహారంలో సరిపడా ఉండేలా చూసుకోవాలి.
చక్కెర చర్మానికి శత్రువు.. కాబట్టి తీపి పదార్థాలను పరిమితంగానే తీసుకోవాలి. అలాగే శీతల పానీయాలు, మద్యాలకు దూరంగా ఉండాలి.