భారత్ లో చాలామంది ఎదుర్కొంటున్న పోషక లోపాల లిస్ట్ ఇదీ..!
భారత్ లో చాలామంది వివిధ రకాల పోషక లోపాలు ఎదుర్కొంటున్నారు. వాటిలో 8 లోపాలు ప్రధానంగా ఉన్నాయి.
ఐరన్ లోపం.. ఐరన్ లోపం రక్తహీనతకు దారితీస్తుంది. ఇది ముఖ్యంగా మహిళలలో ఎక్కువ.
విటమిన్-డి.. విటమిన్-డి లోపం వల్ల ఎముకలకు సంబంధించిన జబ్బులు సులువుగా వస్తాయి.
విటమిన్-బి12..
విటమిన్-బి12 లోపిస్తే నరాల పనితీరు, ఎర్రరక్తకణాల ఉత్పత్తి దెబ్బతింటుంది.
కాల్షియం.. కాల్షియం లోపం వల్ల బోలు ఎముకల వ్యాధి, ఆర్థరైటిస్ ప్రమాదం పెరుగుతుంది.
మెగ్నీషియం..
మెగ్నీషియం లోపం వల్ల కండరాల పనితీరు, కండరాల శక్తి ఉత్పత్తిలో ఇబ్బందులు ఏర్పడతాయి.
అయోడిన్.. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది. గాయిటర్, థైరాయిడ్ జబ్బులు వస్తాయి.
విటమిన్-ఎ..
విటమిన్-ఎ లోపం వల్ల దృష్టిలోపం, రోగనిరోధక శక్తి బలహీనపడటం, చర్మ ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది.
జింక్.. జింక్ లోపం వల్ల రోగనిరోధక పనితీరు దెబ్బతింటుంది. గాయాలు నయం కావడంలో, జీవక్రియలో ఇబ్బందులు తలెత్తుతాయి.
Related Web Stories
పచ్చి మిరపను తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
సైకిల్ తొక్కితే ఇన్నీ ఆరోగ్య ప్రయోజనాలా..!
మొలకలొచ్చిన వెల్లుల్లి తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..!
జీలకర్ర నీళ్లు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలంటే..