మిగిలిన అన్నంతో ఇన్‌స్టెంట్ వడలు..  రెసిపీ ఇదే

మిగిలిన అన్నంతో ఆరోగ్యకరమైన వడలు చేసుకోవచ్చు

ఈ వడలు తయారీ విధానం ఎంతో ఈజీ

కావాల్సిన పదార్థాలు: అన్నం (రెండు కప్పులు) పెరుగు (2  టేబుల్ స్పూన్లు) బియ్యం పిండి (రెండు టేబుల్ స్పూన్లు) ఉప్మా రవ్వ (2  టేబుల్ స్పూన్లు) ఒక ఉల్లిపాయ (సన్నగా తరిగినవి)

జీలకర్ర (ఒక టీ స్పూన్) రెండు పచ్చిమిర్చి (సన్నగా తరిగినవి) మిరియాల పొడి (అర టీ స్పూన్) అల్లం తురుము (ఒక టేబుల్ స్పూన్ ) కొత్తిమీర, కరివేపాకు (సన్నగా తరిగి) ఉప్పు (తగినంత) నూనె (డీప్ ఫ్రై కోసం)

తయారీ విధానం: ముందుగా మిగిలిన అన్నాన్ని తీసుకుని పెరుగును కలిపి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. నీరు కలపొద్దు

 అన్నం, పెరుగు మిశ్రమంలో బియ్యం పిండి, ఉప్మా రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, అల్లం తురుము, మిరియాల పొడి, జీలకర్ర వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా కలుపుకోవాలి.

ఈ మిశ్రమాన్ని పదిహేను నిమిషాల పాటు నానబెట్టాలి

ఈ పిండితో వడలు ఒకేసారి చేసుకోవచ్చు లేదా ఒక్కొక్కటిగా చేసుకోవచ్చు

కడాయిలో నూనె పోసి వేడి అయ్యాక.. వడలు వేసుకుని మీడియం మంటపై గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. 

ఆపై కరకరలాడే రుచికరమైన అన్నం వడలు రెడీ...