బరువు తగ్గడానికి అరటిపండు ఆరోగ్యకరమైన ఎంపికేనా..

అరటిపండు ఒకటి తింటే చాలు కడుపు నిండిపోతుంది. మరీ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని మనలో చాలామంది తినడానికి భయపడతాం. 

అరటిపండు సాధారణంగా బరువు పెరగడానికి కాకుండా బరువు తగ్గేందుకు సహకరిస్తాయట..

సరైన పద్దతిలో తీసుకుంటే అరటి పండ్లతో బరువు తగ్గడం చాలా సులువు. 

నిండుగా ఆరోగ్యంగా ఉండాలంటే అల్పాహారంలో అరటిపండు తినడం, వోట్మిల్, చియాగింజలు, డాలియాను కలిపి తీసుకోవడం మంచి ఫీల్ ఇస్తుంది.

అరటిలో అతితక్కువ కొవ్వులు, ఫైబర్ కలిగిన సూపర్ ఫుడ్..

అరటిపండును వర్కౌట్‌కి ముందు, తర్వాత స్నాక్ రూపంలో తీసుకోవచ్చు. 

ఇందులోని స్టార్చ్ కంటెంట్ జీవక్రియను పెంచడంలో సహకరిస్తుంది. ఇది బరువును సులభంగా తగ్గించడంలో సహకరిస్తుంది.

అరటిపండులో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి. సాయంత్రాలు ఎనర్జిటిక్ గా ఉండేందుకు బనానా స్మూతీని తీసుకోవచ్చు.

ఈ పండులో స్టార్చ్, రెసిస్టెంట్ స్టార్చ్ అధికంగా ఉంటాయి. ఇది కొవ్వును కాల్చే ప్రక్రియ పెంచుతుంది.