పండిన అరటి పండ్లు తినడం ఆరోగ్యానికి మంచిదేనా? అసలు నిజాలు ఇవీ..!

పండిన అరటిపండ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.  అరటిపండు పండితే దాని రుచి తియ్యగా మారుతుంది. పోషకాల పరిమాణం పెరుగుతుంది.

అరటిపండు తొక్క నల్లగా మారి దాని పై ఫంగస్ ఏర్పడితే అలాంటి అరటిపండ్లు తినకూడదు.

పండిన అరటిపండులో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడంలో  సహాయపడుతుంది.

వ్యాయామానికి ముందు లేదా తరువాత అరటిపండు తింటే మంచిది. ఇది శక్తిని, కండరాల తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడుతుంది.

పండిన అరటిపండులో అధిక మొత్తంలో పొటాషియం ఉంటుంది.  ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

పండిన అరటిపండ్లలో అధిక మొత్తంలో సహజ చక్కెరలు ఉంటాయి.  వీటిని ఎక్కువ తింటే బరువు పెరుగుతారు.