జుట్టు ఎక్కువగా రాలుతోందా..
ఈ జాగ్రత్తలుతీసుకుంటే
వెంటనే కంట్రోల్ అవుతుంది..
జుట్టు రాలడానికి ప్రధాన
కారణం వెంట్రుకల
కుదుళ్లు బలహీనమవడమే
కుదుళ్లు బలంగా ఉండాలంటే
విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు
ఉండే పోషకాహారం తీసుకోవాలి.
వెంట్రుకల కుదుళ్లు బలంగా
ఉండేందుకు వాటికి తగినంత
రక్త ప్రవాహం అందేందుకు
మాడు మీద
మసాజ్ చేసుకోవాలి.
ప్రతిరోజూ కనీసం పదిహేను
నిమిషాలు కొబ్బరినూనెతో
తలమీద సున్నితంగా
మర్దన చేసుకోవాలి.
జుట్టు రాలడాన్ని అరికట్టి
వెంట్రుకలకు పోషణ
అందించడంలో గుడ్లు
ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
కొబ్బరి పాలలో క్యాల్షియం,
ఐరన్, పాస్పరస్, విటిమిన్లు,
ప్రొటీన్లు సమృద్దిగా ఉంటాయి
తాజా కొబ్బరి పాలను
తలకు పట్టించి అరగంట
ఆరనివ్వాలి. తరవాత
తలస్నానం చేయాలి.
కలబంద గుజ్జును తలకు
పట్టించి గంటసేపు ఆరనివ్వాలి.
తరవాత గోరువెచ్చని నీటితో
కడగాలి. కలబంద గుజ్జు
తలలోని పీహెచ్ లెవెల్స్‌ని
సమతుల్యం చేస్తుంది.
గ్రీన్ టీ లోని యాంటీ
ఆక్సిడెంట్లు కుదుళ్లను
బలోపేతం చేసి జుట్టు
రాలడాన్ని తగ్గిస్తుంది
Related Web Stories
గంటల తరబడి కూర్చుని పనిచేస్తున్నారా.. అయితే అనారోగ్య సమస్యలు తప్పవు..
ఐస్ క్రీమ్ తినడం వల్ల ఇన్ని లాభాలా..
జామ ఆకుల టీ తాగడం వల్ల కలిగించే ప్రయోజనాలు ఇవే..
రాత్రంతా ఏసీ ఆన్‌లో పెట్టి నిద్రపోతున్నారా.. అయితే, ఈ ముప్పు తప్పదు..!