మీరు తినే ఆహారంలో మెగ్నీషియం  ఉండేలా చూసుకోండి

మెగ్నీషియం అనేది గొప్ప పోషకం

గుండె లయ, కండరాల సంకోచాలు, రక్తపోటు అదుపు, శక్తిని పుట్టించటం వంటి పనుల్లో పాలు పంచుకుంటుంది

మెగ్నీషియం మనం తినే ఆహార పదార్థాలలో సహజంగానే ఉంటుంది

వయసు, లింగ భేదాన్ని బట్టి మనిషికి రోజుకు 310 నుంచి 420 మి.గ్రా. మెగ్నీషియం కావాలి  

మెగ్నీషియంతో కూడిన పదార్థాలను ఎంపిక చేసుకోవాలి

బాదం, జీడిపప్పు, వేరుశనగలు, గుమ్మడి గింజలతో మెగ్నీషియం లభ్యమవుతుంది

కంది, పెసర, శనగ, మినప వంటి పప్పుల న్నింటిలోనూ కూడా బాగా లభిస్తుంది

పాలు, పెరుగు అనగానే క్యాల్షియమే గుర్తుకొస్తుంది కానీ వీటిల్లో కూడా మెగ్నీషియం ఎక్కువ గానే ఉంటుంది

అలాగే కూరగాయల్లో బఠానీలు, బంగాళా దుంపలలో,ఆకు కూరలలో దండిగా ఉంటుంది