పిల్లలు తినేప్పుడు ఫోన్‌ చూస్తున్నారా..  అయితే ఈ సమస్యలు వస్తాయ్‌..!

తినే సమయంలో ఫోన్ చూడటం వల్ల పిల్లల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది.

ఇది అజీర్ణం, గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది.

చిన్న వయసులోనే అనేక కంటి సమస్యలకు దారితీయవచ్చు.

 భోజనం చేస్తూ ఫోన్ చూడటం వల్ల పిల్లల మానసిక ఆరోగ్యం పాడు అవుతుంది.

 భోజనం చేసేటప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఫోన్ ఇవ్వకుండా ఉండాలి.

మొబైల్‌ లేకుండా ఐదు నిమిషాల పాటు వారికి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి.

కుటుంబ సభ్యులు అందరూ కలిసి భోజనం చేయండి. ఇలా చేస్తే మీ పిల్లలకు మంచి అలవాటు చేసిన వారు అవుతారు.