ఉలవలు ఆహారంగా తీసుకోవడం వల్ల.. ఇన్ని ప్రయోజనాలున్నాయా..?

ఉలవల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయని డైటీషియన్లు చెబుతున్నారు. వీటిని ఉలవచారు, వడలుగా తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయని అంటున్నారు.  

ఉలవల్లో ఫైబర్‌ సమృద్ధిగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగవుతుంది. 

మలబద్ధకం, గ్యాస్ వంటి జీర్ణవ్యవస్థ సమస్యలకు చెక్ పెడుతుంది. ఉలవలు ఆకలిని పెంచుతాయి. పిల్లలకు పెడితే మంచిది.

ఉలవల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. షుగర్ పేషంట్స్ ఇవి తరచు తీసుకుంటే మంచిది. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణకు సహాయపడుతుంది.

ఉలవల్లో ఫినాలిక్ సమ్మేళనాలుంటాయి. ఇది కొలెస్ట్రాల్‌ కరగడానికి సహాయపడుతుంది.

ఉలవలు తరచుగా తీసుకుంటే.. కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. కీళ్ల నొప్పులతోపాటు ఎముక సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారూ తీసుకుంటే మంచింది. 

గాయాలు త్వరగా మానడానికి ఉలవలు తోడ్పడతాయి.

ఉలవల్లో యాంటీ- మైక్రోబియల్‌ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. గ్రామ్ పాజిటివ్, గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడుతుంది. 

నెలసరి సమస్యలతో ఇబ్బంది పడే మహిళలు వీటిని ఆహారంలో భాగం చేసుకోంటే మంచిదని డైటీషియన్లు చెబుతున్నారు.