మీ కాలి పిక్కలు పట్టేస్తున్నాయా?.. ఈ విషయాలు తెలుసుకోండి..

మీకు తరచుగా లేదా అప్పుడప్పుడు కాలి పిక్కలు పట్టేసినట్టు అనిపిస్తుంటుందా? విపరీతంగా నొప్పెడుతున్నాయా?

కొందరికి నిద్రలో లేదా కదలకుండా కూర్చున్నప్పుడు కాలి పిక్కలు రాళ్లలా మారిపోయి విపరీతంగా నొప్పెడుతుంటాయి. మరికొందరి కాళ్లలోని సిరలు నీలం రంగులోకి మారి కనిపిస్తుంటాయి.

కాళ్ల పిక్కలు పట్టడానికి నరాలలో ఏర్పడే అడ్డంకులే కారణం. ఇలా జరగడానికి కొన్ని కారణాలు ఉంటాయి.

మీ శరీరంలో కొలస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోవడం ఓ కారణం కావచ్చు.

రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల కూడా నరాలలో బ్లాక్‌లు ఏర్పడతాయి.

తగినంత నిద్ర లేకపోయినా ఈ విధంగా కాళ్లలో రక్తప్రసరణ సరిగ్గా జరగదు.

ఇలా కాళ్ల నరాలలో అడ్డంకులు ఎక్కువగా ఏర్పడినపుడు కొన్ని ప్రత్యేక లక్షణాలు కనబడతాయి.

మీ పాదాలు చాలా చల్లగా మారిపోవచ్చు. ఉదయం లేచిన వెంటనే పాదాలు నొప్పెట్టవచ్చు.

మోకాళ్ల కింద వాచినట్టు అనిపించవచ్చు. మడమల దగ్గర ఎక్కువగా వాపు కనిపిస్తుంటుంది.