నిద్ర సరిగా లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
ప్రతి ఒక్కరికీ రోజుకు 7నుంచి 8గంటల నిద్ర అవసరం.
రెండు రోజుల పాటు నిద్రలేకపోతే అనేక సమస్యలు తలెత్తుతాయి.
రెండు రోజుల పాటు నిద్రలేకపోతే శరీరంలో కండరాలు అలసిపోవడంతో పాటూ బలహీనపడతాయి.
మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతుంది.
నిద్రలేకపోవడం వల్ల చిరాకు, కోపం పెరిగిపోతుంది.
రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. కొన్నిసార్లు అపస్మారక స్థితికి చేరుకునే ప్రమాదం ఉంది.
నిద్రలేకపోవడం వల్ల ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే సామర్థ్యం తగ్గిపోతుంది.
ఊబకాయం, మధుమేహం, గుండె సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
నిద్రలేకపోవడం వల్ల రక్తపోటులో హెచ్చుతగ్గులు ఏర్పడతాయి.
Related Web Stories
అంజీర్ పండ్లను పాలతో కలిపి తాగితే...
వక్కలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
అశ్వగంధతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
నల్ల వెల్లుల్లితో ఇన్ని ప్రయోజనాలా..