ప్రతి ఒక్కరికీ విటమిన్ B12 ఎంతో అవసరం. ఒకవేళ శరీరంలో ఈ విటమిన్ లోపం ఉంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయో తెలుసుకుందాం..
విటమిన్ B12 లోపం ఉంటే శరీరం అలసటకు గురవుతుంది. తద్వారా రోజు వారీ కాల్యకలాపాలు చేసుకునేందుకూ శక్తి ఉండదు.
Title 1శరీరంలో విటమిన్ B12 లోపిస్తే రక్త హీనత సమస్య తలెత్తుతుంది. దీనివల్ల చర్మం లేత లేదా పసుపు రంగులోకి మారుతుంది.
B12 లోపంతో ఎర్ర రక్తకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. చివరకు ఈ సమస్య ఎనీమియాకు దారి తీసే ప్రమాదం ఉంది.
విటమిన్ బి12 లోపం ఉంటే జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. మలబద్ధకం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
బి12 లోపం వల్ల న్యూరోలాజికల్ సమస్యలు తలెత్తుతాయి. మెదడు పనితీరు బలహీనమవడంతో పాటూ జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.
విటమిన్ బి 12 లోపంతో నాలుక, నోరు ఎరువు రంగులోకి మారడంతో పాటూ అల్సర్స్ కూడా మొదలవుతాయి.
శరీరరంలో విటమిన్ బి 12 లోపిస్తే.. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడంతో పాటూ సూదితో గుచ్చిన అనుభూతి కలుగుతుంది. కొన్నిసార్లు హృద్రోగ సమస్యలకూ దారి తీయొచ్చు.
బి12 విటమిన్ లోపంతో బాధపడే వారు చామ గడ్డ, బంగాళదుంప, మష్రూమ్, తృణ ధాన్యాలు, గుడ్లు, రెడ్ మీట్ తదితరాలను తీసుకోవాలి.