లంబోదరుడికి ఇష్టమైన పాయసం ఇంట్లోనే.. ఇలా ఈజీగా

 స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి నెయ్యి వేడి చేసుకోవాలి. తరువాత అందులో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వేయించాలి.

జీడిపప్పు, ఎండుద్రాక్షను పక్కకు తీసుకుని, అదే కడాయిలో సేమియాని వేయాలి. 

తక్కువ మంట మీద సేమియాను గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

తరువాత పాలు పోసి అదే మంట మీద స్లోగా ఉడికేలా చేయాలి. మధ్యమధ్యలో స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. 

సేమియా మెత్తబడిన తర్వాత అందులో పంచదార, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

 అంతే లంబోదరుడికి ఎంతో ఇష్టమైన, రుచికరమైన సేమియా పాయసం రెడీ. స్టవ్ ఆఫ్ చేయండి. వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలిపితే సరి.