షుగర్ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా సగాని కంటే ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతోంది.

డయాబెటిస్ బారిన పడిన వారిలో సామాన్యులే కాదు.. సినీ సెలబ్రిటీలు సైతం ఉన్నారు.

అయితే అనేక జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని కంట్రోల్ చేస్తున్నామని వారు చెబుతున్నారు.

హీరోయిన్ సమంత డయాబెటిస్ బాధితురాలు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెప్పారు.

వ్యాయామం, ఆహార నియమాల ద్వారా దాన్ని నియంత్రిస్తున్నట్లు సమంత తెలిపారు.

బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ 17 ఏళ్లకే టైప్ వన్ డయాబెటిస్ బారిన పడ్డారు.

క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అనుసరించి దాన్ని కంట్రోల్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

యూనివర్సల్ హీరోగా గుర్తింపు పొందిన కమల్ హాసన్ కూడా మధుమేహ వ్యాధిగ్రస్తుడే.

షుగర్ కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఆయన ప్రతిరోజూ యోగా, వ్యాయామం చేస్తారు.

మంచి జీవనశైలి అలవర్చుకుని ఆయన ఎప్పుడూ ఫిట్‌, ఎనర్జిటిక్‌గా ఉంటున్నారు.

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ కూడా మధుమేహం బారినపడ్డారు.

టైప్ వన్ డయాబెటిస్‌తో నిక్ బాధపడుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు.

క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం ద్వారా నియంత్రించుకుంటున్నట్లు నిక్ తెలిపారు.