భూమ్మీద లాగానే విషపూరిత ప్రాణులు సముద్రంలోనూ ఉంటాయని తెలుసా..
ఇవి భూమ్మీద ఉన్న విష ప్రాణులైన పాములు, తేళ్లు కంటే చాలా డేంజర్..
బాక్స్ జెల్లీ ఫిష్ టెంటకిల్స్‌లో ప్రమాదకరమైన విషం ఉంటుంది.
ఇది కుడితే నిమిషాల్లోనే గుండె ఆగిపోతుంది. అలాగే పక్షవాతం వస్తుంది.
స్టోన్ ఫిష్ వెనకభాగంలో విషపూరితమైన వెన్నుముకలు ఉంటాయి.
అవి శక్తిమంతమైన టాక్సిన్ విడుదల చేసి మనుషులకు హాని కలిగించగలవు.
లయన్ ఫిష్ శరీరం చుట్టూ ముళ్లు ఉండి అందంగా కనిపిస్తాయి.
ఆ ముళ్లల్లో విషం ఉంటుంది. అది కుడితే విపరీతమైన నొప్పితో అల్లాడిపోతారు.
కోన్ నత్తల దంతాల్లో విషం ఉంటుంది. అవి కుడితే ప్రాణాలకు ప్రమాదం.
సముద్రపు పాములు ప్రపంచంలో అత్యంత విషపూరితమైనవి.
ఇవి కరిస్తే కండరాల పక్షవాతం, శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతిని ప్రాణాలు పోతాయి.
ఇరుకండ్జీ జెల్లీ ఫిష్ కుడితే వాంతులు అవుతాయి. గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అలాగే తీవ్రమైన నొప్పి, ముఖ్యంగా మనకు ప్రాణం లేదనే కొత్త అనుభూతి కలిగిస్తుంది.
బ్లూ రింగ్డ్ ఆక్టోపస్ భూమ్మీద పాముల కంటే ప్రమాదకర విషాన్ని కలిగి ఉంటుంది.
దీని విషంలో టెట్రోడోటాక్సిన్ ఉండి మనుషుల శ్వాసకోశ వ్యవస్థ దెబ్బతీస్తుంది.
Related Web Stories
పెసరపప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా..!
బ్రౌన్ బ్రెడ్ తింటే ప్రమాదమా..?
జింక్ అధికంగా ఉన్న వెజిటేరియన్ ఆహారాల గురించి తెలుసా..
పాలు వెల్లుల్లి కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా..