34f63df6-47e4-4ef1-a040-2e236b8e914b-3.jpg

బ్రెజిల్ నట్స్ అనేవి ఎన్నో పోషకాలు కలిగి ఉండి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

వీటిలో ప్రోటీన్స్, ఫైబర్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.

అలాగే ఫాస్పరస్, జింక్, థయామిన్, విటమిన్-ఈ వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి.

బ్రెజిల్ నట్స్‌కు సంబంధించి అనేక ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

బ్రెజిల్ నట్స్‌లో ఉండే సెలీనియం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

వీటిలోని మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు రక్త సరఫరా మెరుగుపరిచి, బీపీని నియంత్రిస్తాయి.

ఎల్లాజిక్ యాసిడ్ నరాలను రక్షిస్తుంది, మనుషులు డిప్రెషన్ బారిన పడకుండా చేస్తుంది.

మోనో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్, ఫైబర్, ఖనిజాలు గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి.

శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు బ్రెజిల్ నట్స్ తోడ్పడతాయి.

బ్రెయిన్ హెల్త్‌, జీవక్రియ మెరుగుపరిచి, కొవ్వు తగ్గించేందుకు సహాయపడతాయి.

వీటిలో ఉండే సెలీనియం థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా చేస్తుంది.