అధిక బరువుతో కొంతమంది బాధపడుతుంటే సన్నగా ఉన్నామని మరికొంతమంది చింతిస్తుంటారు.

అయితే శరీర బరువును సమతుల్యమైన ఆహారం, వ్యాయామంతో ఎలా పొందాలో తెలుసుకుందాం..

ప్రొటీన్లు అధికంగా ఉండే గుడ్లు, మాంసం వంటివి కండరాలు పెరిగేందుకు దోహదపడతాయి.

పాలు, పెరుగు, చీజ్‌లో ప్రొటీన్లు కాల్షియం అధికంగా ఉండి బరువు పెరిగేందుకు తోడ్పడతాయి.

అరటిపండ్లు, మామిడి వంటి పండ్లు సహజమైన చక్కెరలతో బరువు పెరగడంలో సహాయపడతాయి.

బాదం, వాల్నట్, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు బరువు పెంచుతాయి.

ఆలివ్ ఆయిల్, కొబ్బరినూనె వంటివి వంటకాల్లో ఉపయోగించడం వల్ల బరువు పెరుగుతుంది.

అరటిపండు, పాలు, పండ్లతో తయారు చేసిన స్మూతీలు, ప్రొటీన్ పౌడర్‌తో చేసిన షేక్‌లు తాగాలి.

పీనట్ బటర్‌ను బ్రెడ్ లేదా రొట్టెలపై పూతగా వేసుకొని తినడం వల్ల శరీర బరువు పెరుగుతుంది.

అలాగే వ్యాయామం చేయడం ద్వారా బరువు పెరిగే కండరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

అయితే బరువు పెరిగేందుకు ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోద్దని వైద్యులు చెప్తున్నారు.