ముంబైలో ‘డబ్బావాలా’ తరహాలోనే కేరళలో ‘లంచ్‌బెల్‌’

ముంబైలో డబ్బావాలాలు తెల్లక్యాప్‌తో కనిపిస్తారు. 

 ఆహారం ఆర్డర్‌ చేసుకోవాలంటే  ‘పాకెట్‌మార్ట్‌’యాప్‌ను ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. 

ఇదే మాదిరిగా కేరళలో మహిళలతో ‘లంచ్‌బెల్‌’ పేరుతో ఆహారాన్ని  అందజేస్తున్నారు.

కేరళలోని తిరువనంతపురంలో గల ‘కుడుంబశ్రీ’ అనే మహిళల సమూహం ఆకుపచ్చ టీషర్టు, పింక్‌ క్యాప్‌తో డెలివరీ చేస్తారని లోకల్‌ కో ఆర్డినేటర్‌ రమేష్‌ తెలిపారు.

తిరువనంతపురం కుడుంబశ్రీ యూనిట్‌లోనే సెంట్రల్‌ కిచెన్‌ ఉంది.

హోటల్స్‌లోని జంక్‌ఫుడ్‌ కాకుండా  కేరళలో తినే ఆహారాన్ని సరఫరా చేస్తారు.

శాకాహారం అయితే రూ.60,  మాంసాహారం, చేపల కూర అయితే రూ.99 తీసుకుంటారు. 

 వెజ్‌థాలీ, బిర్యానీ లాంటి ఆహారాన్ని మెనూలోకి చేర్చారు. 

వాస్తవానికి ఉదయం ఏడు గంటల్లోపు మాత్రమే బుకింగ్‌ ఆర్డర్స్‌ను పరిగణిస్తారు. 

తాజా ఆహారం, విటమిన్లు, న్యూట్రిన్లు ఉండే పోషకాహారాన్ని డెలివరీ చేస్తారు.

ఎకో ఫ్రెండీకోసమే క్యారీ బాక్స్‌లను వాడుతున్నారు.

భవిష్యత్‌లో కాలుష్యం చేయకుండా ఉండటానికి ఈ- స్కూటర్లు వాడనున్నారు. 

కొచ్చి లాంటి ఇతర ప్రాంతాల్లో కూడా లంచ్‌బెల్‌ మోగించటానికి రెడీ అవుతున్నారు.