30లలో శరీరానికి కావాల్సిన పోషకాల లిస్ట్ ఇదే..!

 ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, హార్మోన్ల సమతుల్యతను ప్రోత్సహించడానికి విటమిన్ డి అవసరం.

రోజువారీ ఆహారంలో ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది శరీరం ఐరన్ అవసరాలను తీర్చడానికి అవసరం.

ఇందులో బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకు పచ్చకూరలు, గింజలు ఉన్నాయి.

సహజంగా విటమిన్ డి స్థాయిలను పెంచడానికి సాల్మన్, సార్డినెస్, పాలు, పుట్టగొడుగులు వంటి ఆహారం తీసుకోవాలి.

ఒమేగా - 3 కొవ్వు ఆమ్లాలు మెదడు పనితీరును మెరుగుపరిచేందుకు, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించేందుకు మంచి పోషకాలను అందిస్తాయి.

ఎముకల సాంద్రత పెరగడానికి కాల్షియం ముఖ్యమైనది. ఇది కండరాల కదలిక, నరాల పనితీరును మెరుగుపరచడంలో కూడా సహకరిస్తుంది.

 పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు  కాల్షియం స్థాయిలను పెంచుతాయి.

ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలను పెంచడానికి ఫోలేట్ అవసరం. గర్భిణీ స్త్రీలకు కూడా ఇది చాలా ముఖ్యమైన పోషకం.