మరమరాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
బరువు తగ్గడం
శరీర బరువు తగ్గించుకోవాలనుకునే వారికి మరమరాలు ది బెస్ట్ ఫుడ్. దీంట్లోని ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి సహకరిస్తుంది.
రక్తపోటు
మిగతా తాళింపు ఆహార పదార్థాలతో పోలిస్తే మరమరాల్లో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
గ్లుటెన్ ఫ్రీ
మరమరాలు గ్లుటెన్ ఫ్రీ ఫుడ్. అందుకే గ్లుటెన్ ఎలర్జీతో బాధపడేవారు వీటిని ఎంచక్కా తినొచ్చు.
వ్యాధి నిరోధక శక్తి
మరమరాల్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కనుక ఇవి వ్యాధినిరోధక శక్తిని పెంపొందించడంలో సహకరిస్తాయి.
ఎనర్జీ
మరమరాల్లో కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వల్ల శరీరానికి చాలా త్వరగా ఎనర్జీని అందిస్తాయి. కండరాలకు బలాన్ని కూడా చేకూరుస్తాయి.
ఎముకలకు బలం
వీటిలో ఫైబర్, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలకు బాలన్ని ఇవ్వడంలో సహాయపడతాయి.
జీర్ణశక్తి
మరమరాల్లో అధికంగా ఉండే ఫైబర్ వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తద్వారా కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ, ఆల్సర్ వంటి సమస్యలు రావు.
మలబద్ధకం
వీటిలోని ఫైబర్ పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరగడానికి ఉపయోగపడుతుంది. దాంతో మలబద్ధకం సమస్య తగ్గుతుంది.