శృంగారం విషయంలో చాలా మందికి అనుమానాలు, అపోహలు ఉంటాయి.

భోజనం చేసిన వెంటనే శృంగారం చేస్తే గుండెపోటు వస్తుందని చాలా మంది నమ్ముతారు.

అయితే ఈ విషయంపై ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం ఏం వివరణ ఇచ్చారంటే..

భోజనం తర్వాత రతి క్రీడలో పాల్గొంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువని సమరం చెప్పారు.

కానీ గుండె సమస్యలు ఉన్నవారికి మాత్రం బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందన్నారు.

ఇలాంటి సమస్యలు ఉన్న వ్యక్తులు కనీసం గంటపాటు సెక్స్‌కు దూరంగా ఉండాలన్నారు.

సాధారణంగా భోజనం తర్వాత శృంగారం చేస్తే బీపీ 40 పాయింట్ల వరకూ పెరుగుతుంది.

అందువల్ల ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు సైతం తక్కువగా తిన్నప్పుడు మాత్రమే సంభోగానికి వెళ్లాలి.

కడుపునిండా తిన్నట్లయితే అరగంట నుంచి గంట వరకూ రతి క్రీడకు దూరంగా ఉండాలి.

ఫుల్‍గా తిన్నప్పుడు సమయం తీసుకోకపోతే పెరిగే బీపీ గుండెపై ప్రభావం చూపిస్తుంది.

అందుకే తిన్న వెంటనే కాకుండా గ్యాప్ తీసుకుని శృంగారం చేయాలని సమరం చెప్తున్నారు.