బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తినడం చాలా మందికి అలవాటుగా మారిపోయింది.

అయితే దంతాలు కడిగిన వెంటనే ఆహారం తీసుకోవడం సరైనదేనా?

టిఫిన్‌కి ముందు బ్రష్ చేయడం మంచి అలవాటు. కానీ కొంత విరామం తర్వాత టిఫిన్ తినాలి.

బ్రష్ చేసిన వెంటనే టిఫిన్ తింటే నోటిలో సలైవా ఉత్పత్తి తగ్గి జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.

టూత్‌పేస్ట్‌లో ఉండే ఫ్లోరైడ్ వంటి పదార్థాలు నోటి రుచిని తాత్కాలికంగా మార్చుతాయి.

అందువల్ల ఆహార పదార్థాల రుచిని నాలుక గుర్తించకుండా అయిపోతుంది.

బ్రష్ చేసిన వెంటనే నోటిలోని పీహెచ్ స్థాయి ఆల్కలైన్‌గా మారుతుంది.

ఇది కొంతసేపటి వరకూ ఆహారం జీర్ణం కాకుండా అడ్డంకిగా మారుతుంది.

అందుకే బ్రెష్ చేసిన వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత తింటే మంచిది.