వ్యాయామం చేయడం ఆరోగ్యానికి చాలా మంచిదని
అందిరికీ తెలిసిన విషయమే..
మంచి ఆరోగ్యం, బాడీ షేప్ కోసం చాలా మంది జిమ్‌లో కుస్తీలు పడుతుంటారు.
అయితే బాడీ షేప్ త్వరగా రావాలని అతిగా చేసే వ్యాయామాలు ప్రమాదరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రంగా వ్యాయామాలు చేస్తే శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గి డీహైడ్రేట్ అవుతారు.
వేగంగా బరువు తగ్గాలని చేసే ప్రయత్నంలో కండరాలపై తీవ్ర ఒత్తిడి పడి అవి దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఎనీమియా, ఆర్థరైటీస్, గుండె సమస్యలు, జ్ఞాపకశక్తి తగ్గడం, శరీరం సరిగా అభివృద్ధి చెందకపోవడం జరుగుతాయి.
అతి వ్యాయామాల వల్ల విడుదలయ్యే అడ్రినలైన్ లాంటి హార్మోన్లు మంచికన్నా ఎక్కువగా చెడు చేస్తాయి.
నిద్రలేమి, యువతుల్లో పీరియడ్స్ సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఒళ్లు నొప్పులు, నీరసం, నిరాశ, నిస్పృహలు ఆవహించడం వంటి సమస్యలు తలెత్తుతాయి.
అధిక వ్యాయామాలు కొద్దిరోజులు ఆపాలంటే ఒకేసారి ఆపకూడదు. బదులుగా యోగా, ధ్యానం వంటివి చేయాలి.
Related Web Stories
కాకరకాయను వీటితో కలిపి తినకూడదు
కంటినిండా నిద్ర లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా
సీ ఫుడ్ అలెర్జీ లక్షణాలు ఇవే..
పైనాపిల్ తింటే.. ఈ లాభాలన్నీ మీ సొంతం..!