రోజూ మెడిటేషన్ చేసే వారిలో అనేక సానుకూల మార్పులు కనిపిస్తాయి

ధ్యానం ఓ నిరంతర ప్రయాణం. దీని లక్ష్యం ఎవరిని వారు మెరుగు పరుచుకోవడమే!

కొత్తగా మెడిటేషన్ ప్రారంభించే వారు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

తొలుత 5 నుంచి 10 నిమిషాల పాటు ధ్యానంతో ప్రారంభించి క్రమంగా ఈ సమయాన్ని పెంచాలి

నిశ్శబ్దమైన ప్రదేశంలో ఎటువంటి ఆటంకాలు రాకుండా మెడిటేషన్ చేయాలి

తొలిసారి మెడిటేషన్ చేసే వారు ఊపిరి తీసుకుని వదలడంపై దృష్టి మర్లకుండా జాగ్రత్త పడాలి.

సౌకర్యవంతంగా కూర్చోవడానికి  ఏర్పాట్లను చేసుకున్నాకే మెడిటేషన్ ప్రారంభించాలి

మెడిటేషన్ ప్రారంభించిన కొత్తల్లో దృష్టిని శ్వాసపై నిలపలేకపోవడం సహజం. కాబట్టి, సహనం కొల్పోకుండా ఏకాగ్రతకు యత్నించాలి

కొత్తగా మెడిటేషన్ చేస్తున్న వారికి మార్గనిర్దేశకత్వం చేసే యాప్‌లు, ఇతర ఆన్‌లైన్ వనరులను వినియోగించాలి

క్రమం తప్పకుండా రోజూ ఒకే టైంలో ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత లభిస్తాయి.