మెంతినీరు Vs తులసినీరు... ఖాళీ కడుపుతో ఏది తాగితే ఎక్కువ ఆరోగ్యం?

మెంతినీరు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి.  మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ ఉన్న వారికి ఇది మంచిది.

తులసిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.  ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సహాయపడతాయి.

మెంతి గింజలలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.  మలబద్దకం నుండి,  ఉబ్బరం నుండి ఉపశమనం కలిగిస్తుంది.

తులసిలో అడాస్టోజెనిక్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఒత్తిడి,  ఆందోళన నియంత్రించడంలో సహాయపడతుంది.

మెంతినీరు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతుంది.  గుండె ఆరోగ్యానికి మంచిది.

ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తగ్గించడంలో తులసి సహాయపడుతుంది. ఇది  జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

మెంతినీరు ఆకలిని అరికట్టడంలో సహాయపడుతుంది.  ఇది బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

గొంతు నొప్పి, దగ్గు నుండి ఉపశమనం కలిగించడంలోనూ, శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ తులసి సమర్థవంతంగా పనిచేస్తుంది