కొలెస్టెరాల్‌పై కంట్రోల్ కోసం ఉదయాన్నే కొన్ని పనులు చేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

పీచుపదార్థం అధికంగా ఉండే ఓట్స్ వంటివాటిని బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్ తగ్గిపోతుంది.

గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ కొలెస్టెరాల్‌ను తగ్గిస్తాయి. కాబట్టి ఉదయం వేళ ఈ టీ తాగాలి.

బ్రిస్క్ వాకింగ్, జాగింగ్‌తో హెచ్‌డీఎల్ కొలెస్టెరాల్ పెరిగి ఎల్‌డీఎల్ కొలెస్టెరాల్ తగ్గుతుంది.

పళ్లు, బెర్రీలు వంటివి ఉదయం తింటే ఆరోగ్యకరమైన కొవ్వులు అంది గుండె ఆరోగ్యం మెరుగవుతుంది.

కొలెస్టెరాల్ అదుపులో ఉండాలంటే ప్రాసెస్డ్‌ ఫుడ్స్ జోలికి అస్సలు వెళ్లకూడదు

ఉదయం వేళ బాగా నీరు తాగితే జీర్ణక్రియ మెరుగుపడి, బరువు, కొలెస్టెరాల్ అదుపులో ఉంటాయి.

వైద్యుల సూచనల ప్రకారం క్రమం తప్పకుండా మందులు వాడితే కొలెస్టెరాల్ కంట్రోల్‌లో ఉంటుంది