మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్ రెండిట్లో ఏది బెటర్?

ఉదయం వేళ నడక, సాయంత్రం వేళ నడకతో కొన్ని భిన్నమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

నిపుణులు చెప్పేదాని ప్రకారం, తెల్లవారుతున్న వేళ నడకతో రోజును ఓ సానుకూల దృక్పథంతో మొదలుపెట్టొచ్చు. 

ఉదయం నడకతో మానసిక ఆరోగ్యం మెరగవడంతో పాటు పేరిగే ఎనర్జీ లెవెల్స్‌తో రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.

ఉదయ నడక జీవక్రియలపై మంచి ప్రభావం చూపిస్తుంది. వేగవంతమైన మార్నింగ్ నడకతో జీవక్రియలు వేగవంతమవుతాయి.

రోజంతా ఈ ఉత్సాహం కొనసాగి కొవ్వు కరిగిపోతుంది. బరువు అదుపులో ఉంటుంది.

 ఇక సాయంత్రం వేళ నడకతో కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు

 సాయంత్రం నడక ఎంతో ఉపయోగపడుతుంది. మనసు కుదుటపడి రాత్రిళ్లు కంటి నిండా నిద్రపోగలుగుతారు.

 నడకతో ఏ ప్రయోజనం ఆశిస్తున్నామనే దాన్ని బట్టి వ్యక్తులు తమకు నచ్చిన సమయంలో వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.