నల్ల యాలకులతో ఎన్ని ప్రయోజనాలంటే.. 

నల్ల యాలకులు జీర్ణక్రియ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది అజీర్ణం, ఉబ్బరం, గ్యాస్ సమస్యలకు చెక్ పెడుతాయి. 

ఈ మసాలా దినుసు జీర్ణ ఎంజైమ్‌ల సారాన్ని  ప్రేరేపిస్తుంది.  ఇది ఆహార విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.

శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా నల్ల యాలకులు పనిచేస్తాయి. ఇవి ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయి.

ఇవి యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. నోటి దుర్వాసన, దంత క్షయం కలిగించే బ్యాక్టీరియాను తగ్గిస్తాయి. 

నల్ల యాలకులు తీసుకోవడం వల్ల అది వాయు మార్గాలలో మంటను తగ్గిస్తుంది.

ఈ యాలకులు శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి సహాయపడుతాయి.

బరువు తగ్గడానికి  నల్లయాలకులు జీవక్రియను పెంచుతాయి. కొవ్వు కరిగించేందుకు సహకరిస్తాయి.

గుండె ఆరోగ్యం విషయంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.