ప్రోటీన్ అనేది కండరాల పెరుగుదలకు ఎంతో అవసరమైన ఆహార పదార్థం.

సాధారణంగా ప్రోటీన్ అనేది ఎక్కువగా మాంసాహార పదార్థాల నుంచి లభిస్తుంది.

అయితే మరి నాన్ వెజ్ తినని వారి పరిస్థితి ఏంటి అనుకుంటున్నారా..?

అలాంటి వారు ప్రోటీన్ పొందేందుకు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాలకూరలో ప్రోటీన్ పుష్కలంగా ఉండి కండరాల పెరుగుదలకు ఉపయోగపడుతుంది.

అన్ని రకాల బీన్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉండి కండరాల ఎదుగుదలకు తోడ్పడుతుంది.

100 గ్రాముల బఠానీలో సుమారు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

బ్రోకలీలో ప్రోటీన్‌తోపాటు విటమిన్ సి, కె వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

గోబీలో ప్రోటీన్‌తోపాటు ఫైబర్ అధికంగా ఉండి కండరాల బలాన్ని పెంచుతుంది.

ఆస్పరాగస్‌లో ప్రోటీన్‌తోపాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ వంటి పోషకాలు ఉంటాయి.

జొన్నల్లో మోస్తరు ప్రోటీన్ ఉంటుంది. అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్‌తోపాటు ప్రోటీన్ ఉంటుంది.