పసుపు భారతీయ వంటకాల్లో అత్యంత ముఖ్యమైన పదార్థమని చెప్పుకోవాలి.
అయితే కొంతమంది వ్యాపారులు స్వాలాభం కోసం దాన్ని కల్తీ చేస్తున్నారు.
వంటల్లో వాడే ముందు కల్తీ పసుపును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం..
గ్లాసు నీటిలో కొంచెం పసుపు వేస్తే స్వచ్ఛమైనది నీటి అడుగుకు చేరుతుంది.
అలాగే నీరు లేత పసుపు రంగులోకి మారుతుంది.
కల్తీ పసుపు వేసిన నీరు ముదురు రంగులోకి మారి, పసుపు పొడి నీటిపై తేలుతుంది.
సాఫ్ట్ టిష్యూ పేపర్‌పై పసుపు వేసి వత్తితే నూనె మరకలు ఏర్పడితే అది కల్తీ పసుపు.
పసుపులో వెనెగర్ వేసి కలిపితే కల్తీ పసుపు ఎరుపు, గులాబీ రంగులోకి మారుతుంది.
అసలైన పసుపునకు తీపి, కారం రుచి ఉండగా.. కల్తీ రుచి కృత్రిమంగా ఉంటుంది.
నిజమైన పసుపునకు సువాసన ఉంటుంది. కల్తీ పసుపులో ఆ వాసన సరిగా ఉండదు.
అసలు పసుపు మృదువుగా, మెత్తగా ఉంటే కల్తీ పసుపు గరుకు, ముద్దగా ఉంటుంది.
తెల్లని బట్టపై పసుపు రుద్దితే బట్ట పసుపు రంగులోకి మారితే అది నిజమైనది.
Related Web Stories
జమ్మి చెట్టుతో ఇన్ని లాభాలా.. తెలిస్తే అస్సలూ వదలరు
ఈ ఆహారాలు తింటే కీళ్ల నొప్పులు పెరుగుతాయి..
దబ్బ పండు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా..?
బ్రేక్ ఫాస్ట్ గా అన్నం తింటే ఏమౌతుందో తెలుసా