పన్నీర్ vs ఎగ్  ఆరోగ్యానికి ఏది మంచిది..

ఉడకబెట్టిన ఓ కోడి గుడ్డు (44 గ్రాములు) ద్వారా ఆరు గ్రాముల ప్రోటీన్, 4.2 గ్రాముల కొవ్వులు శరీరంలోకి చేరతాయి.

40 గ్రాముల పన్నీర్ ద్వారా 7.4 గ్రాముల ప్రోటీన్, 5.8 గ్రాముల కొవ్వులు శరీరంలోకి చేరతాయి. 

గుడ్డును ఏ రకంగానైనా మన ఆహారంలో భాగం చేసుకోవచ్చు. 

 పన్నీర్‌ను వివిధ  కూరల్లో వేసుకోవచ్చు. 

గుడ్లు తినడం వల్ల గుండె జబ్బులకు కారణమయ్యే ట్రైగ్లిజరాయిడ్స్ శాతం తగ్గి మంచి కొలస్ట్రాల్ స్థాయులు పెరుగుతాయి.

మధుమేహంతో బాధపడేవారికి పన్నీర్ మంచి ఆహారం. 

పన్నీర్ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కేన్సర్ ముప్పు తగ్గుతుంది. 

పన్నీర్, గుడ్లు మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లను, విటమిన్లను అందిస్తాయి. 

అయితే పన్నీర్‌తో పోల్చుకుంటే గుడ్లు అన్ని చోట్లా తక్కువ ధరకు లభిస్తాయి. అయితే శాకాహారులకు పన్నీర్ మంచి ప్రత్యామ్నాయం.