మీ పాదాల వంపు మీ వ్యక్తిత్వం ఎలాంటిదో
చెప్పేస్తుంది.. జస్ట్ ఓ సారి చెక్ చేసుకోండి..!
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వాటిలో పర్సనాలిటి టెస్ట్ ఒకటి. శరీరంలో ప్రతి భాగం మనిషి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియజేస్తుంది.
పాదాలు రెండు రకాలు. పాదాల కింది భాగం కొందరికి.. విల్లులాగా వంపు తిరిగి ఉంటుంది. మరికొందరికి చదునుగా ఉంటుంది.
పాదాలు ఏ ఆకారంలో ఉంటే.. వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? అంటే..
పాదాలు చదునుగా ఉన్న వారు నార్మల్‌గా ఓపెన్‌గా ఉంటారు. వాస్తవికతను పరిగణలోకి తీసుకుంటారు. నలుగురిలో కలవడానికి, మాట్లాడటానికి ఆసక్తి కనబరుస్తారు.
వీరికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయి. వీరు బంధాలకు, అనుబంధాలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు.
మానసికంగా చాలా సహజంగా ఉంటారు. ప్రతి విషయాన్ని చాలా రిలాక్స్‌గా ఉంటారు. జీవితపు సవాళ్ల గురించి ఆలోచించడం, సీరియస్‌గా ఉండటం వీరికి అసలు నచ్చదు.
ఇక వంపు తిరిగిన పాదాలు ఉన్నవారికి దూర దృష్టి ఎక్కువ. స్వాతంత్ర్య భావాలు కలిగి ఉంటారు. ప్రతిభ సైతం ఎక్కువే.
చాలా లోతుగా ఆలోచిస్తారు. వీరు ఆలోచనాత్మకంగా ఆత్మపరిశీలనా దృష్టితో ఉంటారు. వీరికి ఏకాంతం అంటే ఇష్టం. చదవడం, నేర్చుకోవడం అంటే ఆసక్తి.
బలమైన వ్యక్తిత్వం ఉంటుంది. వీరు అంతర్ముఖులు. ఇతరులతో అంత ఈజీగా ఏ బందంలోకి వెళ్లరు.. కానీ ఓ సారి బంధంలోకి వెళ్లాక వారికి ప్రాధాన్యత ఇస్తారు.
జీవితంలో సవాళ్లను ఇష్టపడతారు. వాటిని తెలివిగా ఎదుర్కుంటారు. లక్ష్యాలను సాధించడం పట్ల చాలా ఉత్సాహం చూపిస్తారు.
Related Web Stories
ప్రయాణాలలో వాంతులా?.. అయితే ఇలా చేయండి!
సముద్రపు చేపలా, చెరువు చేపలా ఏవి మంచిది..
వెల్లుల్లి గుజ్జును పాదాలకు రాస్తే ఇన్ని లాభాలా..!
వెనిగర్ తో బరువు తగ్గోచ్చా..