ఎవరెస్ట్, ఎండీహెచ్ సంస్థలకు చెందిన నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని హాంకాంగ్ ఆహార నియంత్రణ ప్రాధికార సంస్థ సెంటర్ ఫర్ ఫుడ్ సేఫ్టీ వెల్లడించింది.
ఈ రెండు సంస్థలకు చెందిన నాలుగు ఉత్పత్తుల్లో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు గుర్తించింది. ఇథిలీన్ ఆక్సైడ్‌ని పురుగు మందులో వాడతారు. నాలుగు ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు వెల్లడి.
అందులో ఎవరెస్ట్ కంపెనీ ఫిష్ కర్రీ మసాలా, ఎండీహెచ్ స్పైసెస్‌కు చెందిన మద్రాస్ కర్రీ పౌడర్, మిక్స్‌డ్ మసాలా పౌడర్, సాంబార్ మసాలాలు ఉన్నాయి
వీటి ఉత్పత్తుల విక్రయాన్ని నిలిపివేయాలని, ఇప్పటికే దుకాణాల్లో విక్రయానికి సిద్ధంగా ఉంచినవాటిని తొలగించాల్సిందిగా ఆదేశించినట్టు వెల్లడించింది.
ఆదేశాలను ఉల్లంఘిస్తే 50 వేల డాలర్ల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష కూడా వేస్తారని చెబుతున్న అధికారులు.