ఉబ్బసం నుంచి ఉపశమనం..

ఉబ్బసం ఎవరికైనా, ఎప్పుడైనా  రావొచ్చు సాధారణ అలర్జీ  కూడా దీర్ఘకాలంలో  ఉబ్బసానికి దారి తీయొచ్చు.

వంశపారంపర్యంగా కూడా  సంక్రమించవచ్చు. కాలుష్యం,  ఫుడ్‌ అలర్జీ, డస్ట్‌ అలర్జీలు  కూడా ఉబ్బసంగా మారొచ్చు

కొందరు పుట్టుకతోనే  వెంటబెట్టుకుని రావొచ్చు.  మరి కొందరికి బాల్యంలో  తలెత్తవచ్చు

ఉబ్బసానికి ఉత్తమమైన  చికిత్స నెబ్యులైజర్స్‌,  ఇన్‌హెలర్స్‌, స్టిరాయిడ్స్‌.

ఉబ్బసం అని నిర్ధారణ జరిగేదాకా  ఆగకుండా లక్షణాలు మొదటిసారి  కనిపించిన వెంటనే వైద్యులను  కలిస్తే వ్యాధి ముదరకుండా  నియంత్రించే వీలుంటుంది.

 ఇందుకోసం దగ్గు, జలుబు  మూడు వారాలకు మించి  వేధిస్తుంటే తప్పనిసరిగా  పల్మనాలజిస్టు చేత  పరీక్షలు చేయించుకోవాలి.

ఉబ్బసాన్ని తీవ్రమైన వ్యాధిలా  కాకుండా ఓ అసౌకర్యంగా  భావించి, సమయానికి చికిత్స  తీసుకోగలిగితే నాణ్యమైన  జీవితాన్ని గడపవచ్చు.