ఎండుద్రాక్ష నానబెట్టి తింటే కలిగే లాభాలు.
స్వీట్లు, పాయసాల్లో వినియోగించే ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలామంచిది. చలికాలంలో ఎండుద్రాక్ష నానబెట్టి తింటుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలుంటాయి.
ఎండుద్రాక్షలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యను సులువుగా తగ్గిస్తుంది.
ఎండుద్రాక్షలో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది.
ఎముకలు బలంగా ఉండటానికి కాల్షియం చాలా అవసరం. ఎండుద్రాక్షలో కాల్షియం పుశ్కలంగా ఉంటుంది.
ఎండుద్రాక్షలో యాంటీఆక్సిడెంట్లు బాగుంటాయి. ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడతాయి.
చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఎండుద్రాక్షలో ఉండే విటమిన్స్, మినరల్స్ బాగా సహాయపడతాయి.
ప్రతిరోజూ నానబెట్టిన ఎండుద్రాక్ష తింటూంటే కంటి చూపు చెక్కుచెదరదు.
రోజూ కనీసం 5 నానబెట్టిన ఎండుద్రాక్షలు తింటూంటే జీర్ణశక్తి బాగుంటుంది. గ్యాస్, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి.
ఎండుద్రాక్ష గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.