నానబెట్టిన vs సాధారణ నట్స్: రెండింటిలో ఏవి మంచివి?
సాధారణ నట్స్‌తో పోల్చుకుంటే నానబెట్టినవి త్వరగా శోషణం అవుతాయి. వాటిలోని పోషకాలను శోషణం చేసుకోవడం శరీరానికి సులభం అవుతుంది.
నానబెట్టిన పప్పులు త్వరగా జీర్ణమవుతాయి. సాధారణ గింజలు లేదా పప్పులను జీర్ణం చేసుకోవడం కొందరికి కష్టంగా ఉంటుంది.
సాధారణ నట్స్‌తో పోల్చుకుంటే నానబెట్టినవి మంచి రుచిని కలిగి ఉంటాయి. తినడానికి అనువుగా ఉంటాయి.
సాధారణ, నానబెట్టిన నట్స్‌లో క్యాలరీలు ఒకేలా ఉంటాయి. అయితే నానబెట్టడం వల్ల వాటి పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా కడుపు నిండినట్టు అనిపిస్తుంది.
నానబెట్టిన పప్పులు యాంటీ-యాక్సిడెంట్లను కాస్త ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను తగ్గిస్తాయి.
నానబెట్టిన పప్పులు లేదా గింజలతో పోల్చుకుంటే సాధారణమైనవి ఎక్కువ కాలం నిలవ ఉంటాయి.
నానబెట్టిన నట్స్‌ను తినాలనుకుంటే కాస్త ప్రిపరేషన్ అవసరం. కనీసం 8 గంటల పాటు వాటిని నీటిలో సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి.
సాధారణ, నానబెట్టిన నట్స్ రెండూ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలోని పోషకాలు, విటమిన్లు, ఫైబర్ శరీరానికి ఎంతో అవసరం. అయితే నానబెడితే ప్రయోజనాలు కాస్త ఎక్కువగా ఉంటాయి.